మా నెత్తుటి చుక్కలనే విత్తనాలు పాతండి
మొలకెత్తే తెలంగాణ చెట్టు పళ్ల కెగబడండి
రాజకీయ పక్షాల నేతలారా
నరమాంస భక్షకుల దూతలారా
మా శవాలపై పేలాలేరుకొని తినగరండి
మీ పదవీ లాలసలో మనుషులనీ మరచిపొండి
1. పదవీ అధికారం ఇచ్చింది ఈ ప్రజలేగా
ఓటేసి ఎన్నుకుంది తెలంగాణ జనమేగా
ప్రజాభీష్టమే మీరు కాలరాస్తే
తాత్కాలిక హంగులకై ప్రాకులాడితే
ఇచ్చిన అధికారం తిరిగి తీసుకోనుగలరు
ఎక్కించిన మీ గద్దెను ఎలాగైన దించగలరు
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా
2. రంగుల జండాలిక పక్కన బెట్టండి
తెలంగాణ సాధనకై తెగువ చూపి కదలండి
విద్యార్థుల పోరుబాట విధిగా ఇక సాగండి
ఉద్యమాన యువతతో చేయిచేయి కలపండి
తెలంగాణ గడ్డమీద నిజంగా పుట్టారా
అమ్మానాన్నలకైన తలకొరివి పెట్టేరా
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా
Thursday, February 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
chala bagundi.
ReplyDeleteధన్యవాదాలు డేవిడ్ గారూ!
ReplyDeleteమీ స్పందనలని తెలియజేయండి..ఈ బ్లాగ్ ని గీతాలని..ప్రచారంచేయండి..తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగస్వాములు కండి
http://www.youtube.com/watch?v=7_iTOajYRuY
ReplyDelete