Saturday, February 20, 2010

తెలంగాణ సాధనే- సదా నీ ప్రధానమై

సాగిపో యేటి సంగీతమై
సాగిపో ఎదుగు సూర్య బింబమై
సాగిపో ఆశయాల అంబరాలు గమ్యమై
సాగిపో సాగిపో సాగిపో || సాగిపో||
1. అదురులేక బెదురులేక వడివడిగా సాగిపో
ఒడుదుడుకులు ఎదురైనా అధిగమించి సాగిపో
పంజరాలు బంధనాలు శృంఖలాలు త్రెంచుకొని
సాచిన రెక్కల స్వేఛ్ఛా విహంగ భంగి ఎగిరిపో || సాగిపో||

2. నిరాశా చీకట్లను ఛెండాడుతు సాగిపో
నిరోధాల మబ్బులనిక ఛేదించుక సాగిపో
గ్రహణాలు మరణాలు కారణాలు ఎదిరించి
అపరాహ్ణ గ్రీష్మకారు భానుడిలా రగిలిపో || సాగిపో||

3. భగీరథుడి మనోరథపు చెదరని సంకల్పమై
ఏకలవ్య హృదయాంతర నిశ్చల ఏకాగ్రతై
శ్రమఏవ జయమన్నది సదా నీ నినాదమై
తెలంగాణ సాధనే- సదా నీ ప్రధానమై || సాగిపో||

3 comments:

  1. శ్రీకృష్ణ కమిటీ కంటే ముందు తెలంగాణా అంటూ చాలా కమిటీలు వచ్చాయి. తెలంగాణా ప్రజలు శ్రీకృష్ణ కమిటీని నమ్ముకుంటే తెలంగాణా రాదు. అందుకే సమైక్యాంధ్రవాదులు శ్రీకృష్ణ కమిటీని స్వాగతించారు.

    ReplyDelete
  2. http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/26/detailed-account-of-the-jai-telangana-movement-of-1969-researched-and-arranged-event-wise/

    ReplyDelete