కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలుసుకో
పాతిపెడ్తె విప్లవాలు మొలుస్తాయి కాచుకో
తుఫాను ముందుశాంతిదని వెంటనే గ్రహించుకో
రాకూడని యుద్ధానికి రాయబారమిది యనుకో
జై తెలంగాణ!జైజై తెలంగాణా
1. కోట్లమంది ప్రాణాల బేరానికి సరే సరే
హైద్రాబాద్ వదలకుంటె ఎంతకైన తయారే
భాగ్యనగరు లేకుండా తెలంగాణ శవతుల్యం
కోరుకోండి కేంద్రాన్ని అందుకై తగు మూల్యం
2. వక్రభాష్యాలు చెబితె వినుటకెవరు లేరిక్కడ
దొంగలెక్క చిట్టాలు విప్పుటయే తగదిక్కడ
గతంలోని ఆంధ్ర రాష్ట్ర హద్దులకే సిద్ధపడి
అనుబంధం మిగలనీండి అందుకైన తృప్తిపడి
Sunday, January 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
జై తెలంగాణ! బ్లాగ్ లోని రచనల గురించి వ్యాఖ్యానించండి...బ్లాగ్ ని ప్రచారం చేయండి..తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములు కండి
ReplyDelete