తెలంగాణా తెచ్చువారికి
వేయకుంటే ఓటు
మార్చలేరెవ్వరూ
గ్రహపాటు
ఆచితూచి వెయ్యరా
నీ విలువైన ఓటు
’తెలంగాణా’
మరచిపోతే చేటు
మంచి తరుణం
మించనీకు
తెలంగాణా సాధనకు
ఓటే బ్రహ్మాస్త్రం నీకు
మహాకూటమి
పొందితే ఓటమి
తొలగదు లేమి
తెలంగాణా ఎండమావి?!
చేతి లో
తెలంగాణా చూపెట్టి
సంక నాకించేట్టి
వారినోడించు పట్టుబట్టి
తెప్పతగలేస్తే
ఆడితప్పేస్తే
ఇల్లలికేస్తే
పండగౌనా కన్నెర్రజేస్తే
కడుపుల్లేంది
కావలిస్తే వస్తుందా?
కుటిల కాంగ్రేస్
తెలంగాణా ఇస్తుందా ???!!!!!!!!!!!!
తెలంగాణ
నాడు మౌన వీణ
నేడు దశదిశల
మారు మ్రోగే రుద్రవీణ
ఉక్కుపాదాలకింద
తెలంగాణా
నవాబులు దొరలు ఆంధ్రుల
కారణాన
వెయ్యేళ్లకైనా
వేరుతప్పదు
ఇక ప్రత్యేక తెలంగాణా
పోరుతప్పదు
తెలంగాణా
ఉద్యమాల ఖజానా
త్యాగధనుల
చిరునామా
తెలంగాణా
కాదెవరి దయాభిక్ష
ఈడి అణగారిన
ప్రజల ఆకాంక్ష
ఆంధ్రులు మేధావులు?!
బత్కనేర్చిన జీవులు
చంకెక్కి నెత్తెక్కే
స్వభావులు
ఇది మా తెలంగాణా
బతుకనివ్వండి
స్వేచ్ఛగా
మమ్ము మా మానాన
తేల్చుకోలేమంటే
చావోరేవో
నువ్వసలు
తెలంగాణావాడివే కావో
ఏకులై వస్తారు
మేకులై ఉంటారు
ఆంగ్లేయుకేం తీసిపోరు
ఆంధ్రులు!
ఎన్నాళ్లీ వివక్ష
తెలంగాణాపై
మొసలి కన్నీళ్లే
ప్రభుత సమీక్ష
అటో కాలు ఇటోకాలు
తెరాస నాటకాలు
తెలంగాణాకు
తిలోదకాలు?!
Sunday, January 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment